Wednesday, August 31, 2011

Ganesh Ji

 






Tuesday, August 30, 2011

Ganesh Ji







Ganesh Ji







Ganesh Ji





Ganesh Ji





Sunday, August 28, 2011

KalasaPuja








Ganapathi Puja Vidhanam

 




Ganesha Pradhana

  
 
 
 
 
 
 
 

జిల్లేడుపై వెలసిన గణపతి

సామాన్యంగా దేవాలయాల్లో ఉండే దేవతా విగ్రహాలు శిల్పులు చెక్కినవి కాగా అరుదుగా కొన్ని స్వయంగా వెలసినవి ఉంటాయి. అలాంటి స్వయంభూ దేవాలయాల్లో ఆంధ్రప్రదేశ్ ఖాజీపేట రైల్వే స్టేషన్ దగ్గర్లో శ్వేతార్క గణపతి దేవాలయం ఒకటి. ఈ గుడిలోని విగ్రహాన్ని ఏ శిల్పీ చేక్కలేదు. తెల్ల జిల్లేడు మొదలుపై స్వయంగా వెలసిన శ్వేతార్క గణపతి.

శిల్పి రూపొందించిన విగ్రహం కంటే స్వయంగా వెలసినప్పుడు దాన్ని ఇంకా పరమ పవిత్రంగా భావిస్తారు భక్తులు. చిత్రమేమిటంటే, కొన్ని స్వయంభూ దేవాలయాల్లా ఈ శ్వేతార్క గణపతిలో అస్పష్టత ఉండదు. ఖాజీపేట గణపతి తల, కళ్ళు, తుండము, ఒకటి పొడుగ్గా, మరొకటి విరిగినట్టుగా ఉండే రెండు దంతాలు, చేతులు, ఆసన భంగిమ, పాదాలు, మూషిక వాహనం... ఇలా ప్రతిదీ స్పష్టంగా విఘ్నేశ్వరుని పోలి ఉంటుంది.

ఈ శ్వేతార్క గణపతి దేవాలయాన్ని దర్శించుకున్నవారి కోరికలు తప్పక నెరవేరుతాయని ప్రశస్తి. చదువు, ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు, ఆరోగ్య సమస్యలు, కాపురంలో కలతలు - ఇలా అనేక సమస్యలతో ఈ గుడికి వచ్చే భక్తులు, తమకు వెంటనే సత్ఫలితాలు చేకూరినట్లు చెప్తారు.

ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ శ్వేతార్క గణపతి దేవాలయం మంగళ వారాల్లో మరీ కిక్కిరిసి ఉంటుంది. మంగళవారం నాడు గరిక పూజలు, గణపతి హోమం జరుపుతారు.

ఖాజీపేటలోని రైల్వే కాంప్లెక్స్ లో శ్వేతార్క గణపతి దేవాలయంతో పాటు సీతారామ లక్ష్మణ, ఆంజనేయ ఆలయం, పద్మావతీ వేంకటేశ్వరాలయం, అయ్యప్ప ఆలయం, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం, సాయిబాబా గుడి కూడా ఉన్నాయి. ఈ కాంప్లెక్స్ లో అడుగు పెట్టగానే మరో ప్రపంచంలోకి వెళ్ళినట్లు ఎంతో హాయిగా, ప్రశాంతంగా ఉంటుంది.


గణపతిని పూజించలేదు - విఘ్నం తప్పలేదు

గణపతి విఘ్నాధిపతి. గణేశుని పూజించకుండా ఏ పని ప్రారంభించినా విఘ్నం తప్పదు. వినాయకుడు సాక్షాత్తూ పరబ్రహ్మ స్వరూపం. చదువు, ఉద్యోగం, ఇల్లు, పెళ్ళి అనే తేడా లేకుండా ఏ పని ప్రారంభించినా ముందుగా వినాయకుని పూజించాలి. లేకుంటే అనుకున్నది సక్రమంగా నెరవేరదు. అడ్డంకులు ఎదురౌతాయి. అందుకు ఎవరూ మినహాయింపు కాదు. కింది ఉదాహరణ చూడండి.

మహాశివుడు, త్రిపురాసుర సంహారం కోసమై వెయ్యి సంవత్సరాల సుదీర్ఘ, కఠోర తపస్సు చేసి "అఘోరాస్త్రం" సృష్టించాడు. రెండు వర్గాల మధ్యా అనేక సంవత్సరాల పాటు ఘోర యుద్ధం జరిగింది. అయినా శివుడు "అఘోరాస్త్రం" ప్రయోగించే అవకాశం రాకపోవడంతో ఏం చేయాలో తోచలేదు. అప్పుడు ఆత్మస్వరూపుడైన శ్రీ మహావిష్ణువును ప్రార్ధించాడు మహాశివుడు.

శివుని ప్రార్థన ఆలకించి విష్ణుమూర్తి ప్రత్యక్షమై మందహాసం చేశాడు. క్షణమాగి, "ఏ పని తలపెట్టినా విఘ్నేశ్వరుని ముందుగా పూజించి, ఆ తర్వాతే పని ప్రారంభించాలి. లేకుంటే పని విజయవంతం కాదు. నువ్వు లయకారుడివి అనే గర్వంతో, గణపతి నీ కొడుకేనన్న అహంభావంతో గణపతిని ప్రార్దిమ్చాకుండా యుద్ధభూమిలో దిగావు. అందుకే నీకు "అఘోరాస్త్రం" ప్రయోగించే అవకాశమే రాలేదు.

ఇప్పటికైనా మించిపోయింది లేదు. విఘ్నేశ్వరుడు నీ పుత్రుడేనన్న సంగతి కాసేపు పక్కనపెట్టి, పరబ్రహ్మస్వరూపంగా భావించు. గణపతిని ధ్యానించు. ఆవాహనం చేయి. షోడశోపచార విధులతో పూజించు. అప్పుడే అనుకున్నది నెరవేరుతుంది. విజయం లభిస్తుంది." అంటూ హితోపదేశం చేశాడు.

అదీ సంగతి. విఘ్నేశ్వరుని పూజించనిదే పని సఫలం కాదు. స్వయంగా శివుడికి కూడా తలపెట్టిన పనిలో విఘ్నం తప్పలేదు. వినాయకుడు సాక్షాత్తూ పరబ్రహ్మ స్వరూపం.

బ్రహ్మచారి అయిన వినాయకునికి భార్యలా?

వినాయకుని పుట్టుక గురించి అందరికీ తెలిసిన కథ సంగతి అలా ఉంచితే, మనకు తెలియని కథలెన్నో ఉన్నాయి. అసలు ప్రాచీన పురాణ వర్ణనలో గజముఖుడు లేడు. గజ ముఖం ప్రస్తావన గణపతి అష్టోత్తరనామాలలో కనిపించదు.

గజముఖుడైన వినాయకుని ఆవిర్భావం శివ పురాణాలలో ఉంది. పార్వతీమాత పిండిబొమ్మకు ప్రాణం పోయడం, శివుడు శిరస్సు ఖండించడం ఏనుగు తల అతికించడం, ప్రమథగణాలకు ఆధిపత్యం – అనే ఈ కథ భారతదేశం అంతటా బహుళ ప్రచారం పొందింది.

తెలుగు కవి నన్నెచోడుడు "కుమార సంభవం" కావ్యంలో పార్వతీపరమేశ్వరుల లీలావినోదంగా గజరూపంలో క్రీడించగా గజముఖుడు జన్మించాడు అని చెప్పాడు.

విఘ్నేశ్వరుడు ఆకాశం నుండి ఆవిర్భవించాడనేది వరాహపురాణ కథనం. దేవకామినులను కూడా తన అందంతో భ్రమింపజేయడం వలన శివుడు, గణేశునికి ఏనుగు తలను కుండ లాంటి బొజ్జను కల్పించాడు అనేది మరొక కథ.

కార్త్యవీర్యార్జునుని సంహరించిన అనంతరం పరశురామదేవుడు, పార్వతీపతి దర్శనార్ధం కైలాసం వచ్చాడు. పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంగా ఉన్న సమయంలో ఆది దంపతులను దర్శించడం వీలుపడదని గణాధిపతి నిరోధించాడు. వారిరువురి మధ్య జరిగిన యుద్ధంలో వినాయకుని దంతం భగ్నమయింది. నాటి నుండి ఏకదంతుడనే నామం స్థిరపడింది అని బ్రహ్మాండ పురాణం చెబుతోంది.

మూషికాసుర సంహార సమయంలో తన దంతాన్నే ఆయుధంగా ఉపయోగించడంతో, ఏకదంతునిగా మిగిలాడని దేవీ భాగవతంలో ఉంది. ఏకదంతం ద్వంద్వాతీత స్థితిని తెలుపుతుందని వేదాంతుల భావన, ద్వాపరయుగం నాటికి విఘ్నేశ్వరుని ఆరాధన స్థిరపడింది.

శ్రీకృష్ణుని దివ్య చరిత్రల శ్యమంతకమణి ఉపాఖ్యానం ఉంది. అవతార పురుషులు కూడా విఘ్ననాయకుని అర్చించవలసిందే.

గణపతి వ్యాస భగవానునికి రాయసకాడయ్యాడు. చేతిలో పక్షి ఈక రాత పరికరం. విదేశాలలో అటువంటి శిల్పాలున్నాయి, దీనినిబట్టి విఘ్ననాయకుడు విద్యాదాతగా ప్రసిద్ధుడు అయ్యాడు. వినాయకుడు బ్రహ్మచారి అయినప్పటికీ, సిద్ధి, బుద్ది – అనే భార్యలను కలిగి ఉన్నాడని చెప్తారు. అంటే, లోకకల్యాణ కారకాలయిన ఆ దివ్యశక్తులు వినాయకుని ఆధీనంలోనే ఉంటాయని చెప్పడం ఆంతర్యం అన్నమాట.

Ayyappa mp3

 

Digu Digu Digu Naaga
Download

 Om Hara Sankara

Ganesa Saranam
 
Download all songs as a single file