Showing posts with label భగవాన్ శరణం భగవతి శరణం. Show all posts
Showing posts with label భగవాన్ శరణం భగవతి శరణం. Show all posts

Wednesday, December 7, 2011

భగవాన్ శరణం భగవతి శరణం

భగవాన్ శరణం భగవతి శరణం
శరణం శరణం అయ్యప్ప
భగవతి శరణం భగవాన్ శరణం
శరణం శరణం అయ్యప్పా

భగవానే - భగవతియే
దేవనే - దేవియే
ఈశ్వరనే - ఈశ్వరియే " భగవాన్ "

నలుబది దినములు దీక్షతో నిన్ను సేవించేదము అయ్యప్ప
పగలు రేయి నీ నామమ్మే స్మరియించేదము అయ్యప్ప " భగవాన్ "

కరిమల వాసా పాప వినాశా శరణం శరణం అయ్యప్పా
కరుణతో మమ్ము కావుము స్వామి శరణం శరణం అయ్యప్ప " భగవాన్ "

మహిషి సంహారా మద గజ వాహన శరణం శరణం అయ్యప్పా
సుగుణ విలాసా సుందర రూపా శరణం శరణం అయ్యప్పా " భగవాన్ "