Thursday, October 27, 2011

Karthikapuranam

అగ్నిసాక్షిగ  పెండ్లాడిన భర్తను జ౦పి, వృద్దాప్య ములో కుష్టు రాలనై   తనువు చాలించిన తరువాత, యమ దూత లవల్ల మహానరక మనుభవిన్చినా పూర్వికుల పుణ్య ఫలము వల్ల ఈజన్మలో కుక్కనైతిని. ఈ రోజు మీరు కార్తిక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలియన్నము తినుట వలన నాకీ జ్ఞానోదయము కలిగినది. కావున ఓ విప్రోత్తమా! నాకు మహోపకారంగా , మీరు చేసిన కార్తిక సోమ వార వ్రత ఫల మొకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్దించుచున్నాను'యని
వేడుకొనగా, కార్తిక సోమవార
వ్రతములో చాల మహాత్యమున్నదని గ్రహించి, ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం  నాటి ఫలమును ఆమెకుధారబోయగా వెంటనే ఒక పుష్పక విమానము అక్కడకు వచ్చెను. ఆమె అందరికి వందనము జేసి అక్కడి వారందరూ చూచుచుండగానే యా విమాన మెక్కి శివ సాన్నిధ్యమున కేగెను. వింటివా జనక మహారాజ! కావున ఈ కార్తిక సోమవార వ్రతమాచరించి, శివ సాన్నిధ్యమును పొందు-మని వశిష్టునకు హితబోచేసి, ఇంకను ట్లు చెప్పదొడ౦గిరి.
ఇట్లు స్కాంద పురాణా౦ తర్గత, వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్య మందలి
రెండవ అధ్యాయము-రెండవ రోజు పారాయణము సమాప్తం.

0 comments:

Post a Comment