Thursday, October 27, 2011

Karthikapuranam

8 వ అధ్యాయము
శ్రీ హరి నామస్మర ణా ధన్యోపాయం
వశిష్టుడు చెప్పిన దంతా విని' మహానుభావా! తమరు చెప్పిన ధర్మములన్ని౦టిని శ్రద్దగా వింటిని. అందు ధర్మము బహు సుక్ష్మ మనియు, పుణ్యం సులభ౦గా కలుగు ననియూ, అది- నదీస్నానము, దీపదానము, ఫలదానము అన్నదానము, వస్త్ర దానము వలన కలుగుననియు చెప్పితిరి. ఇట్టి స్వల్ప దర్మములచేతనే మోక్షము లబించుచుండగా  వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసిన గాని పాపములు పోవని మీవంటి మునిశ్రేష్టులె చెప్పు చుందురు గదా! మరి తమరు యిది సూక్ష్మములో  మోక్షముగా కనబరచినందుకు నాకు అమితాశ్చర్యము  కలుగుచున్నది. దుర్మార్గులు  కొందరు సదాచారములను పటింపక, వర్ణ సంకరులై రౌరవాది నరక హేతువులగు
మహా పాపములు చేయువారు యింత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెకిలించుట వంటిది. కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించ ప్రార్ధించు చున్నాను'యని కోరెను.
అంతట వశిష్టుల వారు చిరునవ్వు నవ్వి .' జనక మహారాజా! నీవు వేసిన ప్రశ్న సహేతుక మైనదే, నేను వేద వేదంములను కూడా పటి౦చితిని. వానిలో కూడా సుక్ష్మ మార్గాలున్నవి. అవి యేమనగా సాత్విక, రాజస, తామసములు అని ధర్మము మూడు రకములు సాత్విక, మనగా దేశ కాల పాత్రలు మూడును సమకూడిన సమయమును సత్త్వమను గుణము జని౦చి ఫలమంతయును పరమేశ్వరర్పితము కావించి, మనో వాక్కాయ కర్మలచె నొనర్చిన ధర్మము అ ధర్మమందు యె౦తటా ఆధిక్యత కలదు.  సాత్త్విక ధర్మము సమస్త పాపములను నాశన మొనర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును. ఉదాహరణముగా తామ్రవర్ణ నది సముద్ర మున కలియు తావునందు స్వాతికర్తెలో ముత్యపు చిప్పలో వర్ష బిందువు పడి ధగ ధగ మెరిసి, ముత్యమగు విధానముగా సాత్త్వికత వహించి, సాత్త్విక ధర్మ మాచరించుచూ గంగ, యమునా, గోదావరి, కృష్ణ నదుల పుష్కరాలు మొదలుగు పుణ్య కాలముల యందు దేవాలయముల యందు- వేదములు పటించి, సదచారుడై, కుటి౦బీకుడైన బ్రాహ్మణునకు యెంత స్వల్ప దానము చేసిననూ, లేక ఆ నదీ తీరమందు న్న  దేవాలయం లో జపత పాదు లొనరించినను విశేష ఫలమును పొందగలరు.
రాజస ధర్మమ మనగా- ఫలాపేక్ష  కలిగి శాస్త్రోక్త  విధులను విడిచి చేసిన దర్మం. ఆ ధర్మం పునర్జన్మ  హేతువై కష్ట సుఖాలు కలిగించున దగను.
తామస ధర్మమనగా - శాస్త్రోక్త  విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబికా చరణార్ధం చేయు ధర్మం. ఆ ధర్మం ఫలము నీయదు.

0 comments:

Post a Comment