Wednesday, December 7, 2011

స్వామియే శరణం అయ్యప్ప




భూతనాథ సదానంద సర్వ భూత దయాపర! రక్ష రక్ష మహా బాహొ శాస్తే తుభ్యం నమో నమః
స్వామియే శరణం అయ్యప్పా అనే శరణ ఘోషలు ఆంధ్ర ప్రాంతమంతా మిన్నుమిట్టుతున్నాయి. ఎక్కడ చూసినా నల్లని వస్త్రాలు ధరించిన స్వాములు నిష్టానియమాలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని పల్లవింపజేస్తున్నారు. భక్తితో తెల్లవారుఝాముననే లేచి చన్నీటిస్నానాలతో వారు భగవద్ భావనలో మునిగితేలుతూ మన సాంప్రదాయాన్ని అందులోని విశిష్టతనూ సజీవంగ నిలుపుతూవున్నారు. ఆర్తులకండదండగా నిలచిన ఆదత్తమూర్తి అయ్యప్పగా వెలసి గాడి తప్పుతున్న మానవాళికి సద్బోధచేసి మనుషుల లక్ష్యమెమిటో గుర్తుచేస్తున్నాడు. కలిమాయా ప్రభావానికి లోనై తమ ధర్మలను మరచిన మనుషులను ఆమాయా ప్రభావాన్నుంచి రక్షించడానికే ఆ శబరిగిరివాసుడు అఖండబ్రహ్మచర్యా దీక్షానిబద్ధుడై మార్గదర్శనం చేస్తున్నాడు.సమస్త మానవాళి సన్మార్గం వైపు మల్లేవరకు ఆదివ్య మకరజ్యోతి అలా దారి చూపిస్తూనే వుంటుంది. అదే ఆ అవతార లక్ష్యంకూడా. తమసోమా జ్యోతిర్గమయ. స్వామియే శరణం అయ్యప్పా.

0 comments:

Post a Comment