Wednesday, December 7, 2011

సత్యము జ్యోతిగ వెలుగునయా

సత్యము జ్యోతిగ వెలుగునయా
నిత్యము దానిని చూడుమయా
పరుగున మీరు రారయ్యా
శబరి గిరికి పోవుదము

శరణం శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
శబరి గిరీశా అయ్యప్పా
స్వామియే శరణం అయ్యప్ప
గురు స్వామియే శరణం అయ్యప్ప

హరిహర మానస సుతుడైన
సురల మొరలను ఆలించి
భువిలో తాను జనియించి
పడునాల్గేండ్లు వసియించి

ఘోరా తడవిలో బాలునిగా
సర్పము నీడలో పవళించి
వేటకు వచ్చిన రాజునకు
పసి బాలునిగా కనిపించి

మనికంట అను
నామముతో
పెంచిరి బాలుని మురిపెముగా
స్వామి మీ మహిమలతో
రాజుకు కలిగెను సుతుడొకడు

గురువాసంలో చదివించి
గురు పుత్రున్ని దీవించి
మాటలు రాని బాలునకు
మాటలు వచ్చెను మహిమలతో

మాతా పితలను సేవించి
మహిషి ని తాను వధియించి
శబరి గిరిలో వేలిసిరి గా మనలను ధన్యుల జేయుటకు
అయ్యప్పా అను నామముతో

శిలా రూపమున తానున్నా
జ్యోతి స్వరూపా మహిమలతో
భక్తుల కోర్కెలు దీర్తురయా

మార్గశిరాన మొదలెట్టి
నలుబది దినముల దీక్షతో
శరణుని భజనలు చేయుచునూ
ఇరుముడి కట్టి పయనించి

భోగికి ముందు చేరాలి
మకర సంక్రాంతి చూడాలి
చాలు చాలు మనకింకా
వలదు వలది ఇక జన్మ

మకర సంక్రాంతి దినమున
సాయం సమయం వేళలో
సర్వం వదిలిన సత్పురుషులకు జ్యోతిగా దర్శన మిచ్చేదరు

పాలాభిషేకం స్వామీకి
నేయ్యాభిషేకం స్వామీకి
తేనాభిషేకం స్వామీకి
పూలాభిషేకం స్వామీకి
కర్పూర హారతి తనకెంతో

పాయసమంటే మరి ఎంతో
శరణన్న పదము ఎంతెంతో
ఇష్టం ఇష్టం స్వామికి

హరివరాసనం స్వామీది
సుందర రూపం స్వామీది
కనుల పండుగ మనకేలే
జన్మ తరించుట మనదేలే

శరణం శరణం అయ్యప్ప
శరణం శరణం శరణ మయా
శరణం శరణం మా స్వామి
నీ దరికి జేర్చుకో మా స్వామి

0 comments:

Post a Comment