Thursday, October 27, 2011

Karthikapuranam

దిపము గాజుబుడ్డి వుండి ఆ గాజును, ప్రకాశిం పజే  యునటులే ఆత్మ కూడా దేహంద్రి యాలను ప్రకాశింప చేయుచున్నది . ఆత్మ పతమాత్మ స్వరూపమగుట వలన, దానికి దారా పుత్రాదులు ఇష్ట ముగుచున్నారు. అట్టి విశేష  ప్రేమాస్పద మగు వస్తు వేదో అది యే ' పరమాత్మ' యని గ్రహింపుము. ' తత్వమసి ' మొద లైన వాక్య ము లంద లి ' త్వం' అను పద మునుకు కించిత్ జ్ఞాత్వాది శాశిష్ట మైన సచ్చిదానంద స్వరూపమని అర్ధము " తత్వమసి" అనేది జీవాత్మ పరమాత్మల యేకత్వమును భోదించును. ఈ రీతిగా సర్వజ్ఞ త్వాది ధర్మములను విదిలి వేయగా సచ్చిదానంద రూప మొక్కటియే నిలుచును. అదియే " ఆత్మ దేహ లక్షణము - లుండుట - జన్మించుట-పెరుగుట- క్షీ ణి౦చుట- చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు. జ్ఞా నానంద స్వరూపమే పూర్ణ త్వము గలది. వేదములలో దేనికి సర్వజ్ఞత్వము, ఉపదేశము, సంపూర్ణత్వము నిరుపించాబడి యున్నదో అదియే " ఆత్మ". ఒక కుండను జూచి అది మట్టితో చేసిన దే యని యే విధముగా గ్రహింతుమో, అటులనే ఒక దేహంత ర్యామి యగు జీవాత్మ పరమత్మయని తెలుసుకొనుము. జీవులచే కర్మ ఫలమను భవింప జేసేవాడు పరమేశ్వరుడ నియు, జీవులా కర్మ ఫలమను భావింతురనియు తెలుసుకొనుము. అందువలన మానవుడు గుణ సంపత్తు గలవాడై  గురుశు శ్రూష నొనర్చి సంసార సంబంధ మగు ఆశలన్ని విడచి విముక్తి నొంద వలయును. మంచి పనులు తలచిన చిట్టా శుద్దియు, దానివలన భక్తి జ్ఞాన వైరాగ్యములు గలిగి ముక్తి పొందును. అందువలన సత్కర్మ నుష్ట నము చేయ వలయును. మంచి పనులు చేసిన గాని ముక్తి లభించదు- అని అంగిరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి యిట్ల నెను.
 
ఇట్లు స్కాంద పురాణా ౦ తర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య మందలి
సప్త ద శా ధ్యాయము- పదిహేడవ రోజు పారాయణ సమాప్తము.

0 comments:

Post a Comment