Thursday, October 27, 2011

Karthikapuranam

                                                       14  వ అధ్యాయము
ఆ బోతును అచ్చుబోసి  వదలుట (వృ షో త్స ర్గము)
మరల వశిష్టుల వారు, జనకుని దగ్గరకు కూర్చుండ బెట్టుకుని కార్తిక మాస  మహత్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలెనను కుతూహలముతో  ఇట్లు చెప్పదొడంగిరి.
ఓ రాజ కార్తిక పౌర్ణమి రోజున పితృ ప్రీతిగా వృ షో త్స ర్జనము చేయుట, శివ లింగ సాలగ్రామములను దానము చేయుట, ఉసిరి కాయలు దక్షణతో దానము చేయుట మొదలగు పుణ్య కార్యముల వలన వెనుకటి జన్మమందు చేసిన సమస్త పాపములను నశింప జేసుకొందురు.
వారికీ కోటి యాగములు చేసిన ఫలముదక్కును ప్రతి మనుజుని పితృ దేవతలును తమ వంశ మందె వ్వరు ఆ బోతునకు అచ్చు వేసి వదలునో అని ఎదురు జుచుచుందురు.
ఎవడు ధనవంతుడై యుండి పుణ్య కార్యములు చేయక, ధన ధర్మములు చేయక కడకు ఆ బోతునకు అచ్చు వేసి పెండ్లి యైననూ చేయడో అట్టి వాడు రౌరవాది సకల నరకములు అనుభవించుట యే గాక వాణి బంధువులను కూడా నరకమునకు గురి చేయును. కాన ప్రతి సంవత్సర౦ కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్టతో  వ్రతమాచరించి సయం సమయమున శివ కేశవులకు ఆలయము నందు దీపారాధన చేసి ఆ రాత్రి యంతయు జగర ముండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు, సన్యాసులకు బోజన మిడిన వారు ఇహ పరములందు సర్వ సుఖములను ను భ వి౦తురు .


కార్తీక మాసములో విసర్జిపవలసినవి
ఈ మాసమందు పరాన్న భక్షణ చేయురాదు. ఇతరులకు యెంగిలి ముట్ట కూడదు. తిన కూడదు. శ్రాద్ధ భోజనం  చేయకూడదు. నీరుల్లి పాయ తిన రాదు. తిలదనము పట్టరాదు. శివార్చన, సంద్యావందనము చేయని వారు వండిన వంటలు తిన రాదు. పౌర్ణమి, అమావాస్య , సోమవారముల నాడు సూర్య చంద్ర గ్రహణపు రోజుల యందున భోజనం చేయరాదు. కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజించరాదు. విధవ వండినది తినరాదు. ఏకాదశి, ద్వాదశి వ్రతములు చేయు వారలు ఆ రెండు రాత్రులు తప్పని సరిగా జాగారము ఉండవలెను. ఒక్క పుట మాత్రమే బోజన్నాము చేయవలెను. కార్తీక మాసములో తైలము రాసుకొని స్నానము చేయకూడదు. పురాణములను విమర్సిన్చారాడు. కార్తీక మాసమున వేడి నీటితో స్నానము చేసిన కల్లుతో సమానమని  బ్రహ్మ దేవుడు చెప్పెను. కావున, వేడి నీటితో స్నానము కూడదు. ఒక వేళ అనారోగ్యము వుంది యెలాగైన విధవ కుండ కార్తీక మాస వ్రతం చేయవలెనన్న  కుతూహలం గలవారు మాత్రమే వేడి నిటి స్నానము చేయవచ్చును. అటుల చేయు వారలు గంగ, గోదావరి, సరస్వతి, యమునా నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలెను.

0 comments:

Post a Comment