Thursday, October 27, 2011

Karthikapuranam

ఏ నది తనకు దగ్గరలో వుంటే ఆ నదిలో ప్రాతః కాలమున స్నానము చేయవలయును అటుల చేయని యెడల మహా పాపియై జన్మ జన్మములు నరక కుపమున బడి కృశింతురు ఒక వేళ నదులు అందు బాటులో లేనప్పుడు నుతి దగ్గర గాని, చెరువు నందు గాని స్నానము చేయవచ్చును. అప్పుడు యీ క్రింది శ్లోకమును చదివి మరి స్నాన మాచరించావలెను.
శ్లో|| గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిది౦కురు||
అని పాటించుచు స్నానము చేయవలయును. కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పటన శ్రవణ౦, హరి కథ కాలక్షేపము లతో  కాలము గడుప వలెను సయంకలమున సంధ్య వందనది కాది కృత్యములు  ముగించి పూజ మందిరమున నున్న శివుని కల్పోక్తముగా ఈ క్రింది విధమున పూజించ వలెను.
కార్తీక మాస శివ పూజ కల్పము
1 ఓం శివాయ నమః  ధ్యానం సమర్పయామి.
2  ఓం పరమేశ్వరాయ నమః అవాహం సమర్పయామి
3  ఓం కైలసవాసయ నమః నవరత్న సంహాసనం సమర్పయామి.
4 ఓం గౌరీ నాథాయ నమః పాద్యం సమర్పయామి
5 ఓం లోకేశ్వరాయ నమః  అర్ఘ్యం  సమర్పయామి
6 ఓం వృషభ వాహనాయ నమః స్నానం సమర్పయామి
7 ఓం దిగంబరాయ నమః వస్త్రం సమర్పయామి
8 ఓం జగన్నాథాయ నమః యజ్ఞో పవితం సమర్పయామి
9 ఓం కపాల ధారిణే నమః గంధం సమర్పయామి
10 ఓం సంపూర్ణ గుణాయ నమః పుష్పం సమర్పయామి
11 ఓం మహేశ్వరాయ నమః అక్షతాన్ సమర్పయామి
12 ఓం పార్వతీ నాథాయ నమః దుపం సమర్పయామి
13 ఓం తేజో రూపాయ నమః దీపం సమర్పయామి    
14 ఓం లోక రక్షాయ నమః నైవైధ్యం సమర్పయామి
15 ఓం త్రిలోచనాయ నమః కర్పూర నీరాజనం సమర్పయామి
16 ఓం శంకరాయ నమః సవర్ణ మంత్ర పుష్పం సమర్పయని
17 ఓం భావయ నమః ప్రదక్షణ నమస్కారాన్ సమర్పయామి
ఈ ప్రకారముగా కార్తీక మసమంతయు పూజించా వలెను శివ సన్నిధిని దీపారాధన చేయవలెను. ఈ విధముగా శివ పూజ చేసిన యెడల ధన్యు డగును. పూజానంతరము తన శక్తి ని బట్టి బ్రాహ్మణులకు సమర్ధన చేసి దక్షణ తా౦బూలాది సత్కారములతో సంతృప్తి పరచ వలెను. ఇటుల చేసిన నూరు ఆశ్వ మేధ యాగములు చేసిన ఫలము, వెయ్యి  వాజిపేయి యాగములు చేసిన ఫలము కలుగును. ఈ కార్తీక మాసము నెలరోజులు బ్రాహ్మణ సమారాధన శివ కేశవుల సన్నిధి ని నిత్య దీపరాదన, తులసి కోట వద్ద కర్పూర హరతులతో  దీపారాధన చేసిన యెడల వారికీ, వారి వంశీయులకు, పితృ దేవతలకు మోక్షము కలుగును. శక్తి కలిగి యుండి కూడా యీ వ్రతము నాచరించి ని వారు వంద జన్మలు నానా యోనులందునా జన్మించి తర్వత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలగు జన్మలేత్తుదురు. ఈ వ్రతము శాస్త్రోక్త ముగా ఆచరించిన యెడల పది హేను జన్మయొక్క పూర్వ జ్ఞానము కలుగును. వ్రతము చేసినను, పురాణము చదివినాను, విన్నను అట్టి వారలకు సకలైశ్వర్య ములు కలిగి మోక్ష ప్రాప్తి కలుగును.
ఇట్లు స్కాంద పురాణా౦ తర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య మందలి
చతుర్ద శాద్యాయము పద్నాలుగవ రోజు పారాయణము సమాప్తము.

0 comments:

Post a Comment